తొక్కుకుంటూ పోతం బొంద పెడతం
కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్
హైదరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పాలమూరు జరిగిన బహిరంగ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని ఏకి పారేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే 6 నెలలు కూడా ఉండనివ్వరా అని నిలదీశారు. 40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామని అంటారా అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
పార్టీ ఫిరాయింపులు, పార్టీల్ని చీల్చడమే మీ విధానమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకుడదా అని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వాన్ని పడ గొట్టాలని చూసినా లేదా టచ్ చేసినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రభుత్వం కూలి పోతుందని చెప్పడం ఎంత వరకు న్యాయమని అని ఫైర్ అయ్యారు. కొడుకుల్లారా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ జోలికి వస్తే ఒక్కొక్కడిని పండ బెట్టి , పేగులు తీసి మెడల వేసుకుని ఊరేగుతామంటూ హెచ్చరించారు.
పాలమూరు నుండి మొదలైన పార్లమెంటు కురుక్షేత్రానికి శ్రీకారం చుట్టామని ఎనుముల రేవంత్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో 17 సీట్లను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.