Saturday, April 5, 2025
HomeNEWSక్రిమినల్స్ కేసులకు భయపడరు

క్రిమినల్స్ కేసులకు భయపడరు

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి క‌ల్వ‌కుంట్ల కుటుంబంపై ధ్వ‌జ‌మెత్తారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరని అందుకే కేటీఆర్ తాను భ‌య‌ప‌డ‌నంటున్న‌రాని ఎద్దేవా చేశారు. కేసుల‌కు భ‌య‌ప‌డితే నేరాలు చేయ‌ర‌న్నారు. కేసీఆర్ ఏమైనా అంటారనే కిషన్ రెడ్డి అఖిలపక్ష సమావేశానికి రాలేదన్నారు . మెట్రో తానే తెచ్చినట్టుగా కిషన్ రెడ్డి చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఒక‌వేళ ఆయ‌న తెస్తే అది ఎక్క‌డుందో చెప్పాల‌న్నారు. కేసీఆర్ కుటుంబానికి అంత బరితెగింపు ఎందుకో అన్నారు.

చేసిన తప్పులు, అప్పులను ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారని ప్ర‌శ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. జగన్‌ను ప్రగతిభవన్‌కు పిలిచి రాయలసీమ లిఫ్ట్‌కి అనుమతిచ్చింది కేసీఆర్‌ కాదా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తే ఏపీతో తలనొప్పి వచ్చేది కాదు. కట్టుడు.. కూల్చుడు అయ్యిందన్నారు. సోమ‌వారం సీఎం మీడియాతో మాట్లాడారు. ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. ప్ర‌ధానంగా గ‌త 10 ఏళ్లుగా తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఎవ‌రో జ‌నానికి తెలుస‌న్నారు. నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం ప‌నిగా పెట్టుకున్నారంటూ మండిప‌డ్డారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments