కేటీఆర్ చీర కట్టుకుని చెక్ చేయ్
ఉచిత పథకం అమలవుతుందా లేదా
ఆదిలాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏకి పారేశారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి అవాకులు చెవాకులు పేలడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకవేళ అనుమానం ఉన్నట్లయితే ప్యాంటు, షర్ట్ తో కాకుండా చీర కట్టుకుని బస్సుల్లో ప్రయాణం చేస్తే అసలు వాస్తవం ఏమిటో ఉచితంగా ప్రయాణం చేస్తున్న మహిళలు చెబుతారంటూ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కలకలం రేపింది.
ఆరు గ్యారెంటీలు ఇచ్చామని, ఇందులో 5 పూర్తి చేశామన్నారు. మిగిలింది ఒకే ఒక్కటి గ్యారెంటీ మిగిలి ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఆగస్టు 15 లోపు ప్రతి ఒక్క రైతుకు రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేయడం జరుగుతుందని ప్రకటించారు.