NEWSTELANGANA

స‌త్తా చాటుతాం గెలిచి తీరుతాం

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో స‌త్తా చాట‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. మొత్తం 17 సీట్ల‌లో హ‌స్తం హ‌వా చాటాల‌ని పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన కింది స్థాయి బూత్ ఏజెంట్లు, కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, వివిధ విభాగాల బాధ్యులు త‌మ వంతు బాధ్య‌త‌తో క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని సూచించారు.

రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి అయితే రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీలు అమ‌లు చేస్తామ‌న్నారు. ఎన్నిక‌ల అనంత‌రం ఆదిలాబాద్ జిల్లాను ద‌త్త‌త తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

పోరాటాల‌కు, ఉద్య‌మాల‌కు తెలంగాణ ప్రాంతం పెట్టింది పేర‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ‌కు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పాల‌న సాగిస్తున్నామ‌ని, కొంద‌రు తెలివి లేని ద‌ద్ద‌మ్మ‌లు ఆధారాలు లేకుండా మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఇక‌నైనా మాను కోవాల‌ని లేక పోతే ప్ర‌జ‌లే ఛీ కొట్ట‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఆయ‌న కేటీఆర్ ను , హ‌రీశ్ రావును ఏకి పారేశారు.