సీఎం రేవంత్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఎన్డీయేని అతుకుల బొంత అంటూ ఎద్దేవా చేశారు. ఆ కూటమికి అంత సీన్ లేదన్నారు. ఓ వైపు మోదీ దేశానికి చెందిన ప్రభుత్వ రంగ ఆస్తులను గంప గుత్తగా అయిన వారికి, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు కట్ట బెడుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు.
ఇవాళ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని మోదీపై మండిపడ్డారు. ఒక్క జ్యూడిషియరీ (న్యాయ వ్యవస్థ) మాత్రమే కొద్దిగా పని చేస్తోందని , దానిని కూడా నియంత్రించేందుకు నానా తంటాలు పడుతున్నారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.
నరేంద్ర మోదీ పదే పదే చిలుక పలుకులు పలుకుతున్నారని, తమకు 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారని అయితే ఎందుకు చంద్రబాబు నాయుడు, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తో పొత్తు పెట్టుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
రూ. 50 క్వార్టర్ బాటిల్ మద్యం కేసీఆర్ నిర్వాకం వల్ల అది రూ. 200 కు చేరిందన్నారు. ప్రజాస్వామ్యంగా వ్యవహరించడం వల్లనే కల్వకుంట్ల కవితక్క ధర్నా చేయగలిగిందని చెప్పారు. ఎవరైనా బీఆర్ఎస్ తో కలిస్తే సామాజిక బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.