ఉదయనిధిపై రేవంత్ కామెంట్స్
ఆయనపై చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే పార్టీకి చెందిన యువ నాయకుడు, మంత్రి , సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
సనాతన ధర్మంపై ఉదయనిధి గత ఏడాది సీరియస్ కామెంట్స్ చేశారు. దీనిపై ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సందర్బంలో రేవంత రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయనిధి అలా అనాల్సి ఉండేది కాదన్నారు.
ఆనాడు సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఒక ముఖ్యమంత్రిగా తన అభిప్రాయం మేరకు సనాతన ధర్మం గొప్పదని, కానీ ఆయన చేసిన ప్రకటన చాలా తప్పన్నారు. దీనికి ఆయనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.