NEWSTELANGANA

కాళేశ్వ‌ర్ రావు క‌థేంటో తేలుస్తా

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను ఏకి పారేశారు. ఆయ‌న నిర్వాకం కార‌ణంగానే తెలంగాణ స‌ర్వ నాశ‌నం అయ్యిందంటూ వాపోయారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పేరుతో ల‌క్ష 20 కోట్లు త‌గ‌లేశారంటూ ఆరోపించారు. దీనిని ఎవ‌రు భ‌రించాలంటూ ప్ర‌శ్నించారు.

కేసీఆర్ కాద‌ని ఆయ‌న కోట్లు మింగిన కాళేశ్వ‌ర్ రావు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణను సస్య శ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచారని తెలిపారు.

వెంకటస్వామి సూచనతో ప్రాణహితకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని, రీడిజైన్ పేరుతో బీఆరెస్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలు పెంచిందన్నారు. ఏకంగా రూ.1 లక్ష 47 వేల కోట్లకు అంచనాలు పెంచ‌డం దారుణ‌మ‌న్నారు.

ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని వాళ్లు చెబుతున్నారు. వాళ్లు ఇసుకలో పేక మేడలు కట్టారా అని ప్ర‌శ్నించారు. ఇండియా పాకిస్తాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారంటూ ఎద్దేవా చేశారు.. ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అంతే కాదు కొంత మంది అధికారులు ఫైళ్ళు మాయం చేసినట్లు క‌థ‌నాలు కూడా వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు.

తానే డిజైన్ చేసిన అని చెప్పుకున్న కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావ‌డం లేదో చెప్పాల‌న్నారు సీఎం.