NEWSTELANGANA

యాపిల్ ఇంక్ పార్క్ అద్భుతం – సీఎం

Share it with your family & friends

ఆనందంగా ఉంద‌న్న తెలంగాణ ముఖ్య‌మంత్రి

అమెరికా – అమెరికా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి బృందం. శుక్ర‌వారం టూర్ లో భాగంగా యుఎస్ లోని కాలిఫోర్నియా లో కొలువు తీరిన ప్ర‌ముఖ ఐటీ , మొబైల్ త‌యారీ దిగ్గ‌జ సంస్థ యాపిల్ పార్క్ ను సంద‌ర్శించారు.

కుపెర్టినోలో ఉన్న యాపిల్ ఇంక్ ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. దీనిని సంద‌ర్శించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఈ సంద‌ర్బంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాలలో ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా ఉంది.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ ఐటీకి స్వ‌ర్గ ధామంగా ఉంద‌న్నారు . ఇక సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబుతో పాటు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ప్ర‌ధానంగా కొత్త‌గా హైద‌రాబాద్ లో ఎల‌క్ట్రానిక్స్ పార్క్ , స్కిల్స్ యూనివ‌ర్శిటీ , ఏఐ సిటీ, ఫ్యూచ‌ర్ సిటీ త‌యారీ, ప‌బ్లిక్ పాల‌సీ, యాపిల్ హెల్త్ కేర్ విభాగాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌న్నారు రేవంత్ రెడ్డి.

సీనియ‌ర్ యాపిల్ ఎగ్జిక్యూటివ్ ల‌ను , గేమింగ్ సెక్టార్ అభివృద్దికి స‌హాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం. అమెరికా టూర్ అద్భుతంగా సాగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.