మల్కాజిగిరిని మరిచి పోలేను
టీపీసీసీ చీఫ్, ముఖమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ , సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో ఆయన ఇక్కడి నుంచే ఎంపీగా గెలుపొందారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.
ప్రశ్నించే గొంతుకగా తనను నెలబెట్టిన ఘనత మీకే దక్కుతుందన్నారు . గత పాలకుల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడేందుకు కావాల్సినంత శక్తిని , పోరాట పటిమను ఈ నియోజకవర్గ ప్రజలు తనకు ఇచ్చారని కితాబు ఇచ్చారు. ఇదే ప్రస్తుతం తనను సీఎంను చేసిందని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు కావాల్సినంత బలాన్ని ఇచ్చిందని చెప్పారు.
సీఎం దాకా నను తీసుకు వెళ్లిన మీరంతా ఈసారి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మీ రుణం తీర్చుకుంటానని తాను మాటిస్తున్నానని అన్నారు. ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినని , ఈ విషయం మీ అందరికీ తెలుసన్నారు.