ఎలివేటెడ్ కారిడార్లకు కేంద్రం ఓకే
రక్షణ శాఖ మంత్రికి సీఎం థ్యాంక్స్
హైదరాబాద్ – మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు చెక్ పెట్టింది. కొత్తగా సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ మేరకు తెలంగాణలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన పర్మిషన్ ఇవ్వాలని ఢిల్లీ టూర్ లో భాగంగా చేసిన వినతికి స్పందించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.
కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఇప్పటి దాకా ఉన్న అడ్డంకులు తొలగి పోనున్నాయి. హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
దీంతో హైదరాబాద్ లోని రక్షణ శాఖకు చెందిన భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. అంతకు ముందు రేవంత్ రెడ్డి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ అందజేశారు. స్పందించిన మంత్రి వెంటనే పర్మిషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.