కుమారి ఆంటీకి సీఎం భరోసా
త్వరలో సందర్శిస్తానన్న రేవంత్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ నిర్వహిస్తున్న షాపును తొలగించడంపై స్పందించారు. ఈ మేరకు ఆమెకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
పోలీసులు కేసు నమోదు చేయడాన్ని పునః పరిశీలించాలని ఆదేశించారు డీజీపీని. ఇదిలా ఉండగా ఇటీవల రోడ్డు సైడ్ గా కుమారి ఆంటీ టీ, టిఫిన్స్ , భోజనం అమ్ముతోంది. ఆమె చేసే వంటలు బాగున్నాయంటూ యూట్యూబర్ ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఆ వెంటనే ఆ వీడియో హల్ చల్ అయ్యింది.
భారీ ఎత్తున జనం గుమి గూడడం మొదలు పెట్టారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై ఆమె బండిని తొలగించారు. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫుడ్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశించారు రేవంత్ రెడ్డి. తన పాత స్థలంలోనే వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తానని చెప్పారు.