జన నేత స్పూర్తి అజరామరం
వైఎస్సార్ పై సీఎం రేవంత్ రెడ్డి
విజయవాడ – జనం మెచ్చిన అరుదైన నాయకుడు దివంగత , ఏపీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. తాను పాదయాత్ర చేపట్టేందుకు ప్రధాన స్పూర్తి తన నుంచే తీసుకున్నానని చెప్పారు.
డాక్టర్ వైఎస్సార్ 75వ జయంతి సందర్బంగా టీపీసీసీ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ.
ఈ కార్యక్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి, మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వైఎస్సార్ చేసిన సేవలను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.
ఆయన లేని లోటు తీర్చ లేనిదని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన జీవిత కాలమంతా ప్రజల కోసం బతికిన నాయకుడు అని కొనియాడారు. అకాల మరణం బాధాకరమని, ఆయన ఒకవేళ బతికి ఉంటే ఏపీ ఇలా ఉండేది కాదన్నారు.