NEWSTELANGANA

పీవీ తెలుగు జాతికి స్పూర్తి

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దేశానికి అత్యున్న‌త‌మైన సేవ‌లు అందించిన దివంగ‌త ప్ర‌ధాన మంత్రులు చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ , పాములప‌ర్తి వెంక‌ట న‌రసింహారావు, ఎంఎస్ స్వామినాథ‌న్ ల‌కు, బీహార్ కు చెందిన ఠాకూర్ ల‌కు పౌర పుర‌స్కారం భార‌త ర‌త్న ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా మాజీ ప్ర‌ధాన మంత్రి స‌మాధి వ‌ద్ద‌కు చేరుకున్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.

ఆయ‌న‌కు పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న భార‌త దేశాన్ని రక్షించిన అరుదైన నాయ‌కుడు దివంగ‌త పీవీ న‌ర‌సింహారావు అని కొనియాడారు. ఆయ‌న వ‌ల్ల‌నే ఇవాళ దేశం అన్నిరంగాల‌లో ముందుకు వెళుతోంద‌న్నారు.

ఆయ‌న అసాధార‌ణ‌మైన రీతిలో సంస్క‌ర‌ణ‌ల‌కు తెర లేపార‌ని, ఆనాడు విమ‌ర్శించిన వాళ్లు ఇవాళ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నార‌ని తెలిపారు సీఎం. అసెంబ్లీ సాక్షిగా పీవీ గురించి విశేషాలు వెల్ల‌డించారు. ప్ర‌ధానిగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ అన్నారు.

పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్న‌ట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. ఆలస్యమైనా వారికి ఈ గౌరవం దక్కడం గ‌ర్వ కార‌ణంగా ఉంద‌న్నారు. నా తరపున, సభ తరపున, #తెలంగాణ ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు.