సీఎం అయినా సామాన్యుడినే
ఎనుముల రేవంత్ రెడ్డి వైరల్
హైదరాబాద్ – తెలంగాణలో పదేళ్లుగా పాతుకు పోయిన బీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడిన చరిత్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిది. పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఒక రకంగా ఆయన బుల్లెట్ లాంటోడు.
ఉమ్మడి పాలమూరు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కొండారెడ్డి పల్లిలో అత్యంత సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
తనను సీఎం పదవి నుంచి దించేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక కాలం చెల్లిందని, కేవలం ఆరు నెలల కాలం మాత్రమే ఉంటుందని పదే పదే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్ రావు.
దీంతో రేవంత్ రెడ్డి తానే స్వయంగా రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నేతలకు గాలం వేసే పనిలో పడ్డారు. ఇప్పటికే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే జంప్ అయ్యారు. మరికొందరు టచ్ లో ఉన్నట్టు సమాచారం. శనివారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.