సీఎం రేవంత్ రెడ్డి వైరల్
ఉప్పల్ స్టేడియం కళ కళ
హైదరాబాద్ – హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీతా రెడ్డి. ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఆద్యంతం నువ్వా నేనా అన్న రీతిలో ఆట సాగింది. అంతకు ముందు భారీ భద్రత మధ్య రేవంత్ రెడ్డి స్టేడియంలోకి అడుగు పెట్టారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, సినీ రంగానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం , విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా హైదరాబాద్ బేస్ చేసుకుని ఐపీఎల్ లో గత కొన్నేళ్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతోంది. ఈ జట్టు ప్రస్తుతం తమిళనాడు సన్ చేతిలోకి వెళ్లింది. ఈ జట్టుకు సీఈవోగా అందాల ముద్దుగుమ్మ కావ్య మారన్ ఉన్నారు.
ఇదిలా ఉండగా అభిమానులకు హుషారు తెప్పించే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఎవరూ ఊహించని రీతిలో తాను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు జెండాను చేతిలో పట్టుకుని మద్దతు తెలిపారు. దీంతో కెమెరాలన్నీ క్లిక్ మనిపించాయి. మొత్తంగా రేవంత్ రెడ్డి తాను సీఎంనే కాదని క్రీడాకారుననని చెప్పకనే చెప్పారు.