గణపతి బొప్పా మోరియా – సీఎం
ఖైరతాబాద్ వినాయకుడికి పూజలు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వాన నుంచి రక్షించాలని, అందరినీ ఆదుకోవాలని, రాష్ట్రం చల్లంగా ఉండాలని ఆ గణనాథుడిని వేడుకున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి.
శనివారం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో హైదరాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి విగ్రహానికి పూజలు చేశారు. ఈ సందర్బంగా పూజారులు సీఎంకు ఆశీర్వచనం అందజేశారు.
రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు కూడా ఈ పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. తన మనువడుతో కలిసి పూజలు చేయడం భక్తులను ఆకర్షించింది.
ఆ గణనాథుడిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ వినాయకుడికి పూజలు చేయడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు.
మహా గణనాధుని దర్శించు కోవడమే కాదు తొలి పూజను నిర్వహించడం, ఆశీస్సులు పొందడం అనిర్వచనీయమైన అనుభూతికి లోనైనట్లు తెలిపారు సీఎం.
సస్యశ్యామల తెలంగాణ కావాలని , సకల జనుల సంక్షేమ మాగాణంగా వర్దిల్లేలా వినాయకుడు చూడాలని ప్రార్థించినట్లు చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి.