మెదక్ చర్చితో విడదీయలేని బంధం
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి
మెదక్ జిల్లా – సీఎం రేవంత్ రెడ్డి బుధవారం క్రిస్మస్ పండుగ సందర్బంగా మెదక్ చర్చిని సందర్శించారు. ఆయన వెంట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా సీఎం చర్చిలో ప్రార్థనలు చేశారు. ఈ చర్చితో తనకు విడదీయలేని బంధం ఉందని అన్నారు. పీసీసీ చీఫ్ గా ఇక్కడికి వచ్చానని, ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. ఆనాడు సీఎం హోదాలో తిరిగి వస్తానని అన్నానని, అదే నిజమైందన్నారు రేవంత్ రెడ్డి.
ఆ దయ కలిగిన యేసు ప్రభువు ఆశీస్సులతో రాష్ట్రంలో రాచరిక పాలన పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. చర్చి అభివృద్దికి నిధులు విడుదల చేశామని చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు.
ఈ చర్చికి రావడం, ప్రార్థనలు చేయడంతో తన మనసు మరింత తేలికైందన్నారు. ప్రార్థన చేసిన సందర్బంగా తను తప్పకుండా ముఖ్యమంత్రి అవుతానని పాస్టర్ ఆశీర్వదించారని అదే వాస్తవమైందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి.