NEWSTELANGANA

ప‌ల్లె త‌ల్లి ఒడిలో రేవంత్ రెడ్డి

Share it with your family & friends

అపూర్వ‌మైన స్వాగ‌తం సీఎంకు

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని త‌న స్వంతూరికి విచ్చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. అపూర్వ‌మైన సాద‌ర స్వాగ‌తం ప‌లికింది ప‌ల్లె జ‌నం. అభిమాన సంద్రం…
ఆనందపు ఉప్పెనై ఎగసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలిసారి త‌న స్వంతూరికి విచ్చేశారు సీఎం. ఆయ‌న‌కు గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు ఊరి జ‌నం.

ఉమ్మ‌డి కుటుంబం కావ‌డంతో ప్ర‌తి ఏటా విజ‌య ద‌శ‌మి రోజు కొండారెడ్డిప‌ల్లికి రావ‌డం ప‌రిపాటి. ఈసారి సీఎం హోదాలో త‌న ప‌ల్లెకు రావ‌డం మ‌రింత సంతోషాన్ని కలిగించింద‌ని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా స్వంతూరులో చేప‌ట్టిన ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు.

రూ.18 లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో ఎస్సీ కమ్యూనిటీ భవనానికి,. రూ. 18 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, రూ. 64 లక్షలతో ప్రయాణ ప్రాంగణం, ప్రధాన రహదారి విద్యుత్ దీపాలంకరణకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

అంతే కాకుండా రూ.32 లక్షల వ్యయంతో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ కు , రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవన నిర్మాణ ప్రారంభోత్సవం. చేశారు.

రూ. 70 లక్షల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ కార్య‌క్ర‌మంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్ట‌ర్ చిక్కుడు వంశీకృష్ణ‌, నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి, ఎమ్మెల్యే క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.