DEVOTIONAL

తిరుమ‌ల స‌న్నిధిలో రేవంత్ రెడ్డి

Share it with your family & friends

కుటుంబంతో స‌హా స్వామి ద‌ర్శ‌నం

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కుటుంబంతో స‌హా ద‌ర్శించుకున్నారు. టీపీసీసీ చీఫ్ గా గ‌తంలో ఆయ‌న స్వామి వారిని ద‌ర్శించు కోగా ఈసారి పూర్తి స్థాయి అధికారిక హోదాలో సీఎంగా స్వామి ఆశీస్సులు పొందారు.

రేవంత్ రెడ్డి త‌న భార్య , కూతురు, అల్లుడుతో పాటు మ‌న‌వ‌డితో క‌లిసి పుణ్య క్షేత్రాన్ని సంద‌ర్శించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయంలోకి వెళ్లారు. ఆయ‌న‌కు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు. ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు ద‌ర్శ‌నం కోసం.

మనవడు రేయాన్స్ కు పుట్టెంట్రుకులు తీయించి స్వామి వారికి మ్రొక్కులు చెల్లించారు రేవంత్ రెడ్డి కుటుంబం. అంత‌కు ముందు తిరుమ‌ల‌కు చేరుకున్న రేవంత్ రెడ్డికి రచన అతిథి గృహంలో టీటీడీ కార్య నిర్వహణాధికారి ధర్మారెడ్డి, ఇతర అధికారులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

ద‌ర్శ‌నం అనంత‌రం సీఎం కుటుంబం విమానంలో హైద‌రాబాద్ కు తిరుగు ప్ర‌యాణం అయ్యారు.