పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా దినోత్సవం సందర్బంగా యూనివర్శిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ యూనివర్శిటీ ప్రపంచంలోనే టాప్ యూనివర్శిటీగా ఎదగాలని కోరారు. అంతర్జాతీయ యూనివర్శిటీలతో పోటీ పడాలని అన్నారు.
ఇందు కోసం యూనివర్శిటీ వీసీతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు , ఇతర సిబ్బంది, విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళా యూనివర్సిటీ విద్యార్థులు రాణించి రాజీవ్ గాంధీ కలల్నినిజం చేయాలని అన్నారు సీఎం. ఆనాటి రజాకర్ల, దొరల దాష్టీకానికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ఒక్కత్తే ధైర్యంతో పోరాడిందని కొనియాడారు. ఆమె గురించిన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
మహిళలకు స్పూర్తి దాయకం చాకలి ఐలమ్మ జీవితం అని స్పష్టం చేశారు. ఇవాళ తమ ప్రభుత్వం వచ్చాక మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉచితంగా బస్సు ప్రయాణం మహిళల కోసం ప్రవేశ పెట్టడం జరిగిందని చెప్పారు. దీని వల్ల ఎందరో మహిళల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు ఎ. రేవంత్ రెడ్డి.