పీసీసీ చీఫ్ ఎవరైనా కలిసి పని చేస్తా
తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ – టీపీసీసీ చీఫ్ , తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ గా తాను సక్సెస్ ఫుల్ అయ్యానని అన్నారు. తన హయాంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అద్భుత విజయాన్ని నమోదు చేసిందని చెప్పారు.
ఇవాల్టితో తన పీసీసీ చీఫ్ పదవీకాలం ముగిసిందని అన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి. అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్ ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ప్రత్యేక ఛాయిస్ అంటూ ఏమీ లేదని చెప్పారు సీఎం.
అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయడమే నా బాధ్యత అని పేర్కొన్నారు. తన హయాంలో పార్టీ పవర్ లోకి రావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పార్టీ అద్బుతమైన పనితీరు కనబర్చిందని చెప్ఆపరు ఎనుముల రేవంత్ రెడ్డి.