కోవిడ్-19 స్కామ్ పై సబ్ కమిటీ ఏర్పాటు
ప్రకటించిన సీఎం సిద్దరామయ్య
కర్ణాటక – కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గతంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని తెలిపారు.
ఇందుకు సంబంధించి తమ ప్రభుత్వం కోవిడ్ -19 మహమ్మారి నిర్వహణలో జరిగిన అవకతవకలకు విచారణకు సంబంధించి రిటైర్డ్ జస్టిస్ జాన్ మైఖేల్ డికున్నా నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు.
ఈ విచారణ కమిషన్ పూర్తిగా కోవిడ్ -19 స్కామ్ చోటు చేసుకుందని నిర్దారించిందని, ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను ఇవాళ సమర్పించిందని తెలిపారు సీఎం సిద్దరామయ్య. ఈ నివేదికను అమలు చేసేందుకు గాను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధ్యక్షతన మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగిందని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఈ విషయంలో సమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు.