మన్మోహన్ జీవితమే ఓ సందేశం
కర్ణాటక సీఎం సిద్దరామయ్య
కర్ణాటక – డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితమే ఓ సందేశమని, అత్యంత స్పూర్తి దాయకమైన రాజకీయ నేతలలో తను ఒకరని నివాళులు అర్పించారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశాన్ని సంక్షోభం దిశ నుంచి అభివృద్ది వైపు పరుగులు తీసేలా చేసిన గొప్ప రాజకీయవేత్త అని కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చ లేనిదని అన్నారు.
ఇదిలా ఉండగా మన్మోహన్ సింగ్ తన కెరీర్ లో ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించారు. ప్రపంచంలో అత్యున్నతమైన ఆర్థికవేత్తలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నారు. 1982-1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. రాజ్య సభ సభ్యుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా తన పాత్ర నిర్వహించారు డాక్టర్ మన్మోహన్ సింగ్.
ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలకు గాను 1987లో పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. అంతే కాదు 1993లొ ఉత్తమ ఆర్థిక మంత్రిగా అవార్డు అందుకున్నారు. 2017 మన్మోహన్ సింగ్ కు ఇందిరా గాంధి దక్కింది. 13వ భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ కు యావత్ భారత జాతి మొత్తం వినమ్రంగా నివాళులు అర్పిస్తోంది.