NEWSNATIONAL

మొరార్జీ దేశాయ్ ఆశ్ర‌మ పాఠ‌శాలు భేష్

Share it with your family & friends

ప్ర‌శంస‌లు కురిపించిన సీఎం సిద్ద‌రామ‌య్య

క‌ర్ణాట‌క – రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తీసుకు వ‌చ్చిన ఆశ్ర‌మ పాఠ‌శాల‌లు ఇవాళ ఆద‌ర్శ బ‌డులుగా మార‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు.

1994-95లో మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. దీనిని ఏర్పాటు చేయాల‌ని ఆనాడు 1994-95లో దళిత సంఘర్ష్ సమితి సారాయి అంగడి బేడా డిమాండ్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

హోబ్లీ యోగ్యకర్త రెసిడెన్షియల్ స్కూల్ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 822 మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు సీఎం. ఈ ఏడాది 20 రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించాలని నిర్ణయించామ‌ని ప్ర‌క‌టించారు.

గ్రామీణ పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతి హోబ్లీలో రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించాలనే లక్ష్యాన్ని వచ్చే ఏడాదిలోగా సాధించాలన్నారు.

కళ్యాణ్ కర్ణాటకలో పోషకాహార లోపంతో చిన్నారులు బాధ పడుతున్నారు. అందుకోసం 10వ తరగతి చదువుతున్న పిల్లలకు వారంలో ఆరు రోజులు గుడ్లు ఇస్తున్నారు. అన్న భాగ్య కింద 5 కిలోల బియ్యం, క్షీరభాగ్య కార్యక్రమం, పేద పిల్లలకు చెప్పుల భాగ్యం సహా అనేక ప్రసిద్ధ పథకాలు అమలు చేయబడ్డాయి.