మోసం బీజేపీ నైజం – సీఎం
నిప్పులు చెరిగిన సిద్దరామయ్య
కర్ణాటక – మోసం చేయడంలో భారతీయ జనతా పార్టీ టాప్ లో ఉంటుందన్నారు సీఎం సిద్దరామయ్య. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో 10 ఏళ్ల పాటు కొలువు తీరిన బీజేపీ సర్కార్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. మోస పూరితమైన హామీలు ఇవ్వడం పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు.
ఇప్పటి వరకు ప్రతి ఏటా 2 కోట్ల జాబ్స్ భర్తీ చేస్తామని, రూ. 15 లక్షలు జన్ ధన్ ఖాతాలో జమ చేస్తానంటూ నమ్మ బలికిన మోదీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. ఇక ఉద్యోగాల ఊసే లేదని, పూర్తిగా మరిచి పోయాడని ఆరోపించారు సిద్దరామయ్య.
రాష్ట్రంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన కురుబ సామాజిక వర్గానికి బీజేపీ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వినయ్ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం మంచి పద్దతి కాదన్నారు సీఎం. ఇందుకు స్పష్టమైన ఉదాహరణ ఏమిటంటే కేఎస్ ఈశ్వరప్ప కూడా బీజేపీ షాక్ ఇచ్చిందన్నారు. ఆయన కుమారుడికి బీజేపీ టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిందని పేర్కొన్నారు సిద్దరామయ్య.