NEWSNATIONAL

క‌ర్ణాట‌క‌పై క‌క్ష కేంద్రం వివ‌క్ష – సీఎం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన సిద్ద‌రామ‌య్య

క‌ర్ణాట‌క – రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య నిప్పులు చెరిగారు. కేంద్రంలోని మోడీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. సోమ‌వారం జ‌రిగిన స‌మావేశంలో సీఎం ప్ర‌సంగించారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల దేశంలోని 28 రాష్ట్రాలకు మొత్తం రూ. 1,78,193 కోట్లను విడుదల చేసిందన్నారు. ఇందులో కర్ణాటకకు రూ.6,498 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. ఇది కావాల‌ని క‌క్ష సాధింపు త‌ప్ప మ‌రోటి కాద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సిద్ద‌రామ‌య్య‌.

పన్ను వాటాగా ఉత్తరప్రదేశ్‌కు రూ.31,962 కోట్లు, బీహార్‌కు రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.13,987 కోట్లు, రాజస్థాన్‌కు రూ.10,737 కోట్లు ఇచ్చారని, ఇది న్యాయమా ని ప్ర‌శ్నించారు క‌ర్ణాట‌క సీఎం.

ఉత్తరప్రదేశ్‌లో 17.93 శాతం, బీహార్‌లో 10.05 శాతం, రాజస్థాన్‌లో 6.02 శాతం, మధ్యప్రదేశ్‌లో 7.85 శాతం వాటా ఉండగా, కర్ణాటక వాటా 3.64 శాతం మాత్రమేన‌ని పేర్కొన్నారు. పన్నుల పంపిణీకి నిర్ణయించిన ప్రమాణాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రగతి నిరోధక వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయం గురించి బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు విప్ప‌డం లేద‌ని మండిప‌డ్డారు సిద్ద‌రామ‌య్య‌.