చాముండేశ్వరి సన్నిధిలో సిద్దరామయ్య
దేశ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు
కర్ణాటక – విజయ దశమి పండుగ సందర్బంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య.
దసరా ఉత్సవాల చివరి రోజు శనివారం విజయ దశమి, జంబూ సవారి, పంజిన ఊరేగింపు తల్లి చాముండేశ్వరి మాలధారణ ధరించారు పెద్ద ఎత్తున భక్తులు. ఈ శుభ సందర్భంగా దేశ ప్రజలకు, దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు సీఎం సిద్దరామయ్య.
పండుగను పురస్కరించుకుని మాతా చాముండేశ్వరి దేవిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి. గత ఏడాది కంటే ఈసారి మంచి వర్షాలు కురిసి పంటలు పండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు సిద్దరామయ్య.
రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు నిండడం సంతోషకరమని పేర్కొన్నారు. దసరా సంకేతం దుర్మార్గులను నాశనం చేయడం, సత్పురుషుల రక్షణ. రాష్ట్రంలో అశాంతి సృష్టించి జీవితాలను నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్న వారికి భగవంతుడు బుద్ధి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ సందర్బంగా అమ్మ వారిని అంతా బాగుండాలని, దుర్బుద్దిని పోయేలా చూడు తల్లీ అని కోరుకున్నట్లు తెలిపారు.
అంతకు ముందు మైసూరు లోని సత్తూరు మఠంంలో మీడియాతో మాట్లాడారు సీఎం సిద్దరామయ్య.