NEWSANDHRA PRADESH

లా యూనివ‌ర్శిటీకి శ్రీ‌కారం

Share it with your family & friends

న్యాయం అత్యంత కీల‌కం

క‌ర్నూలు జిల్లా – న్యాయం అనేది అత్యంత కీల‌క‌మ‌ని అన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. గురువారం
కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో జనన్నాథగ ట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్లతో నిర్మించనున్న నేషనల్‌ లా యూనివర్సిటీకి భూమిపూజ చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ప్ర‌సంగించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ హైకోర్టు రెస్టింగ్‌ న్యాయమూర్తులకు, ఇతర కోర్టుల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, న్యాయ విభాగం సిబ్బందికి, ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని అన్నారు.

ఈరోజు మన రాష్ట్రంలో, మన రాయలసీమలో, అందులోనూ కర్నూలులో నేషనల్‌ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగానే దీనిని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు జ‌గ‌న్ రెడ్డి.

శ్రీబాగ్‌ ఒడంబడికలో భాగంగా జరిగిన ఆ ఒప్పందం మేరకు ఆ రోజుల్లో ఇక్కడే హైకోర్టు పెడతామని చెప్పారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో క‌ర్నూలు జాతీయ స్థాయిలో మ‌రింత గుర్తింపున‌కు నోచుకుంటుంద‌న్నారు.