గర్ల్స్ పేరెంట్స్ యాజమాన్యంపై సీరియస్
హైదరాబాద్ – మేడ్చల్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది… కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్దకు పేరెంట్స్ చేరుకున్నారు. తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఫీజు కట్టించుకున్నా ఆడపిల్లలకు రక్షణ ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల లోని బాలికల హాస్టల్ బాత్‌రూమ్‌లో రహస్యంగా అనుచిత వీడియోలు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు రోడ్డెక్కారు. యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
కొందరు విద్యార్థులు అనుమానాస్పద కార్య కలాపాలను గమనించడంతో పరిస్థితి వెలుగులోకి వచ్చింది, హాస్టల్ వంటగదిలో పని చేసే ఎవరైనా వీడియోలను రికార్డ్ చేసి ఉండవచ్చని అనుమానించారు. ఆందోళనకరమైన వాదన చాలా మందికి కోపం తెప్పించింది .
మేడ్చల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.