Monday, April 21, 2025
HomeNEWSసీఎంఆర్ కాలేజీ ఘటనపై నోటీసులు

సీఎంఆర్ కాలేజీ ఘటనపై నోటీసులు

త‌క్ష‌ణ‌మే నివేదిక ఇవ్వాల‌ని సీపీకి ఆదేశం

హైద‌రాబాద్ – సీఎంఆర్ ఇంజ‌నీరింగ్ కాలేజీ ఘ‌ట‌న‌పై సీరియ‌స్ గా స్పందించింది రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ . ఈ మేర‌కు సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ కు నోటీసులు జారీ చేసింది. కాలేజీలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా కాలేజీకి సంబంధించిన గ‌ర్ల్స్ హాస్ట‌ల్ లో స్టూడెంట్స్ బాత్రూంలో వీడియో రికార్డింగ్ చేసిన‌ట్లు ఆందోళ‌న చేప‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల లోని బాలికల హాస్టల్‌ బాత్‌రూమ్‌లో రహస్యంగా అనుచిత వీడియోలు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఒక్క‌సారిగా విద్యార్థులు రోడ్డెక్కారు. యాజమాన్యంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ఉద్రిక్త‌త చోటు చేసుకోవ‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు.

కొందరు విద్యార్థులు అనుమానాస్పద కార్య కలాపాలను గమనించడంతో పరిస్థితి వెలుగులోకి వచ్చింది, హాస్టల్ వంటగదిలో పని చేసే ఎవరైనా వీడియోలను రికార్డ్ చేసి ఉండవచ్చని అనుమానించారు. ఆందోళనకరమైన వాదన చాలా మందికి కోపం తెప్పించింది .

మేడ్చల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments