సినిమాలో మేకలు ఉన్నాయో లేదో తెలియదు
హైదరాబాద్ – కమెడియన్ పృథ్వీరాజ్ భార్య షాకింగ్ కామెంట్స్ చేసింది. తన భర్త ఎందుకు సారీ చెప్పాలని ప్రశ్నించింది. సినిమాలో గొర్రెలు ఉన్నాయో లేదో అన్నది తెలియదంటూ ఎద్దేవా చేసింది. డైరెక్టర్ ఏం చెబితే అది మాత్రమే చేశాడని చెప్పింది. కామెడీ ఆర్టిస్ట్ గా తన భర్త పృథ్వీ రాజ్ కామెంట్స్ చేశాడని , అంత మాత్రానికే ట్రోల్ చేస్తారా అంటూ మండిపడింది. ఎవరినీ టార్గెట్ చేయలేదని పేర్కొంది. అయినా నేతలు ఏమైనా గొర్రెలా అంటూ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదిలా ఉండగా పృథ్వీ రాజ్ సంచలనంగా మారారు. ఆయన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. దీనికి కారణం విశ్వక్ సేన్ విభిన్న పాత్రల్లో నటించిన లైలా చిత్రానికి సంబంధించి ప్రీ ఈవెంట్ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా విజయం సాధించాలని కోరారు.
కానీ ఉన్నట్టుండి పృథ్వీరాజ్ సినిమాలలో మేకలు ఉన్నాయని, అవి కేవలం 11 మాత్రమేనని అన్నారు. ఈ కామెంట్స్ తమను ఉద్దేశించే అన్నాడంటూ వైసీపీ నేతలు, ఫ్యాన్స్ భగ్గుమన్నారు. బాయ్ కాట్ లైలా అంటూ ట్రోల్ చేయడం , కామెంట్స్ తో హోరెత్తించారు. దీంతో మనోడికి బీపీ ఎక్కువ కావడంతో ఆస్పత్రి పాలయ్యాడు. దీనిపై తీవ్రంగా స్పందించింది పృథ్వీరాజ్ భార్య.