కమెడియన్ పృథ్వీ రాజ్ కామెంట్స్
కమెడియన్ పృథ్వీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ పై స్పందించాడు. ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. నోటి దూలకు తగిన శాస్తి తప్పదన్నాడు. నిజం ఎప్పుడూ న్యాయానికి తోడుగా నిలుస్తుందన్నారు. మాట విలువైనదని, వాటిని చాలా పొదుపుగా సందర్భానికి తగినట్లుగా వాడాలని సూచించాడు. నిజం తెలుసుకుని ఎప్పుడు , ఎక్కడ ఆగి పోవాలో తెలిసిన వాడు మహా పురుషుడంటూ పేర్కొన్నాడు పృథ్వీ రాజ్. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఇదిలా ఉండగా ఏపీకి చెందిన రాయచోటి పోలీసులు పోసాని కృష్ణ మురళికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆయనను గచ్చిబౌలిలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారంటూ ప్రశ్నించారు. అయినా పట్టించు కోలేదు ఖాకీలు.
తనను వాహనంలోకి ఎక్కించుకుని తీసుకు వెళ్లారు. దీనిపై సీరియస్ గా స్పందించారు వైసీపీ బాస్ జగన్మోహన్ రెడ్డి. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి తప్ప ఇంకోటి కాదన్నారు. తమ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు.