ప్రకటించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్ – సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే తొలి విడతలో పలువురికి ఛాన్స్ ఇచ్చిన హై కమాండ్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
గతంలో టికెట్ ఆశించి భంగ పాటుకు గురైన పటాన్ చెరుకు చెందిన సీనియర్ నాయకుడు, బీఎస్పీకి రాజీనామా చేసి ఇటీవలే పార్టీ తీర్థం పుచ్చుకున్న నీలం మధు ముదిరాజ్ కు మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ప్రకటించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు . కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే కొత్త పేరు తెర పైకి వచ్చింది. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సుగుణ కుమారిని ప్రకటించింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యం వహిస్తున్న నల్లగొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ స్థానానికి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఖరారు చేసింది హైకమాండ్. ఇక నిజామాబాద్ లోక్ సభ స్థానానికి ఎమ్మెల్సీ గా ఉన్న టి. జీవన్ రెడ్డిని ప్రకటించింది .