ఆసక్తికరంగా మారిన మండి
కంగనా వర్సెస్ విక్రమాదిత్య
హిమాచల్ ప్రదేశ్ – దేశ వ్యాప్తంగా హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం ఇక్కడ వివాదస్పద నటిగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భారతీయ జనతా పార్టీ తరపున బరిలో ఉన్నారు. ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగడం ఖాయమని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది.
ఇక కంగనా రనౌత్ కు పోటీగా ప్రముఖ రాజవంశానికి చెందిన విక్రమాదిత్యను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. విక్రమాదిత్య హిమాచల్ ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత రాజా వీరభద్ర సింగ్ , మాజీ పార్లమెంటు సభ్యురాలు ప్రతిభా సింగ్ కుమారుడు.
పోల్ సర్వేల్లో హిమాచల్ బీజేపి కి అనుకూలంగా ఉందని అంటున్నారు కానీ ఈ సీటు ఏం జరుగుతుందో వేచి చూడాలని జనం పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా విక్రమాదిత్యకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. బీజేపీ కాషాయ జెండా ఎగుర వేస్తుందా లేక హస్తం హవా కొనసాగిస్తుందో వేచి చూడాలి. ఓ వైపు కంగనా ఇంకో వైపు విక్రమాదిత్య పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.