NEWSTELANGANA

జ‌ర్న‌లిస్ట్ పై దాడి దారుణం

Share it with your family & friends

శంక‌ర్ స్థితి ఇప్ప‌ట్లో చెప్ప‌లేం

హైద‌రాబాద్ – ఇరు తెలుగు రాష్ట్రాల‌లో నిజాల‌ను నిర్భ‌యంగా రాసే వాళ్ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. ఏపీలో ప్ర‌జ‌లంద‌రి సాక్షిగా ఆంధ్ర‌జ్యోతి రిపోర్ట‌ర్ పై మూకుమ్మ‌డిగా దాడికి పాల్ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ లో ప‌ని చేస్తున్న శంక‌ర్ అనే జ‌ర్న‌లిస్టుపై తీవ్ర స్థాయిలో దాడి జ‌రిగింది.

ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి ద‌య‌నీయాంగా ఉంద‌ని, మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు కుటుంబీకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలే ఈ దాడ‌కి పాల్ప‌డ్డారంటూ వాపోయాడు శంక‌ర్.

త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో అత్య‌వ‌స‌ర చికిత్స కోసం య‌శోద‌కు త‌ర‌లించిన‌ట్లు కుటుంబీకులు తెలిపారు. 24 గంట‌ల పాటు చికిత్స అందిస్తే కానీ ఏం జ‌రుగుతుంద‌నే దానిపై క్లారిటీ ఇవ్వ‌లేమంటూ స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర జ‌ర్న‌లిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్ర‌జాస్వామ్య దేశంలో ఎవ‌రైనా స‌రే త‌మ అభిప్రాయాల‌ను నిక్క‌చ్చిగా చెప్పేందుకు అవకాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు. పిరికిపంద చ‌ర్య‌గా ఈ దాడిని ఖండించారు.