ఇండియా కూటమి ఇక లేనట్టేనా
ఢిల్లీ – ఢిల్లీ కథ ముగిసింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. భారీ మెజారిటీని సాధించింది బీజేపీ. 50 సీట్లను కైవసం చేసుకుంది 70 సీట్లకు గాను. ఆప్ 20 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ఒక్క సీటు సాధించ లేదు. కానీ గణనీయంగా ఓట్లను రాబట్టింది. చాలా సీట్లలో ఆప్ ఓటమికి హస్తం కారణమైంది. తక్కువ తేడాతో ఓటమి పాలయ్యారు అభ్యర్థులు. ఒక ప్లేస్ లో కాంగ్రెస్ 2వ స్థానంలో నిలిచింది. 2022లో గోవాలో ఆప్ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ ఆప్ పై ప్రతీకారం తీర్చుకుంది.
ఇదిలా ఉండగా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ , కాంగ్రెస్ పార్టీ. ఇరు పార్టీలు కీలక ఒప్పందాన్ని కాదనుకున్నాయి. ప్రధానంగా ఆప్ తన పట్టును కోల్పోయింది. మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగింది. చివరకు జనం ఏ చీపురైతే విజయంలో కీలక పాత్ర పోషించారో అదే బిగ్ షాక్ ఇచ్చేలా చేసింది.
ప్రతిపక్షాలకు చెందిన పార్టీలన్నీ ఇండియా కూటమిలో ఉన్నాయి. ఈసారి దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది. భారీ ఎత్తున సీట్లు దక్కాయి ఆయా పార్టీలకు.