NEWSANDHRA PRADESH

ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించిన మోదీ

Share it with your family & friends

ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

అమ‌రావ‌తి – ఏపీలో ప‌ర్య‌టించిన మోదీ ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్తనా నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా గళం పేరుతో స‌భ చేప‌ట్టారు.

ఈ స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన మోదీ భార‌త వైమానిక ద‌ళం హెలికాప్ట‌ర్ ను వినియోగించు కున్నార‌ని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఫోటోల‌ను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. చివ‌ర‌కు ఆధారాల‌తో స‌హా ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేసింది.

నిన్న‌టి నుంచి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ జారీ చేసింది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి దేశ వ్యాప్తంగా అమ‌లులోకి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేసిన త‌ర్వాత మోదీ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించింది.

ఇదే కార‌ణం చూపి ప్ర‌త్యేకంగా 1975లో ఇందిరా గాంధీని అన‌ర్హ‌లుగా ప్ర‌క‌టించిన విష‌యాన్ని గుర్తు చేసింది. ఐఏఎఫ్ హెలికాప్ట‌ర్ ను అద్దెకు తీసుకున్నందుకు బీజేపీ చెల్లించిన‌ట్లియితే ఐఏఎఫ్ హెలికాప్ట‌ర్ ఎందుకు అవ‌స‌రం అనే దానిపై ఈసీ వివ‌రించాలని కోరింది.