కాంగ్రెస్..డీఎంకే మధ్య ఒప్పందం
సీట్ల పంపకం పూర్తి చేసిన పార్టీలు
తమిళనాడు – ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, డీఎంకేల మధ్య చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ , డీఎంకే పార్టీ చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్ లతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఇరు పార్టీల తరపున సీట్ల పంపకానికి సంబంధించి చర్చించారు.
ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇరు పార్టీలు ఓ అవగాహనకు వచ్చాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. సీట్లకు సంబంధించి డీఎంకే 21 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కలిపి మొత్తం 10 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించిందన్నారు కేసీ. ఇందులో 9 సీట్లు తమిళనాడులో ఒక సీటు పాండిచ్చేరిలో పోటీ చేయనున్నట్లు తెలిపారు.
సీపీఐ 2 సీట్లు, సీపీఎం 2 సీట్లు, ఎండీఎంకే ఒక సీటు , వీసీకే 2 సీట్లు, ఐయూఎంఎల్ ఒక సీటు, కేఎండీకే ఒక సీటులో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారు కావడంతో ఆయా పార్టీలు ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.