లోక్ సభ నియోజకవర్గాలలో పోటీ
హైదరాబాద్ – త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ పరంగా ఎంపీ సీట్లకు అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ , సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి . తాజాగా మొత్తం 17 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరికి సీట్లు దక్కనున్నాయనేది ఉత్కంఠ నెలకొంది.
సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బొంతు రామ్మోహన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మల్కాజిగిరి నుంచి ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ , కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్ , త్రిష దామోదర రాజ నరసింహ, మైనంపల్లి హనుమంత రావు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
చేవెళ్ల నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి దొమ్మాటి సాంబయ్య, హరికోట్ల రవి, అద్దంకి దయాకర్ , ఇందిరా సింగుపరం, డాక్టర్ ఆర్ పరమేశ్వర్ ఉన్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి మల్లు రవి, సంపత్ కుమార్, చారకొండ వెంకటేశ్ పేర్లు వినిపిస్తున్నాయి.
పెద్దపల్లి నుంచి వెంకటేశ్ నేత, పెర్క శ్యామ్ , మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డి, నల్గొండ నుంచి జానా రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.