కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ ప్రకటన
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై తాను చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకునేది లేదంటూ స్పష్టం చేశారు. తాను సాధారణ పద్దతిలో మాట్లాడితే బీజేపీ ఎందుకు స్పందిస్తోందంటూ ప్రశ్నించారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. వ్యక్తులకు భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ఒకటి ఉందని తెలుసుకుంటే మంచిదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదన్నారు.
సోమవారం షామా మొహమ్మద్ మీడియాతో మాట్లాడారు. ఈ దేశం బీజేపీది కాదని తెలుసుకుంటే బెటర్ అని హితవు పలికారు. ఈ సందర్బంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రోహిత్ శర్మ గురించి. ఆయన ఆహార్యం అంతగా ఆకట్టు కోదంటూ పేర్కొన్నారు. ఆయన లావుగా ఉన్నారు. బరువు తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ఉన్న భారత జట్టు కెప్టెన్లలో అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే తను రోహిత్ శర్మ ఒక్కడేనని అన్నారు.
ఇదిలా ఉండగా షామా మొహమ్మద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. రోహిత్ శర్మ ఫ్యాన్స్ మండిపడ్డారు. అయినా తాను క్షమాపణ చెప్పేది లేదంటూ స్పష్టం చేశారు షామా మొహమ్మద్. నేను సాధారణ రీతిలో మాట్లాడాను. ప్రజాస్వామ్యంలో మనకు మాట్లాడే హక్కు ఎలా లేదని నేను అర్థం చేసుకోలేక పోతున్నానని పేర్కొన్నారు.