అన్ని వర్గాలపై కాంగ్రెస్ ఫోకస్
మేనిఫెస్టో ఎన్నికల్లో కీలకం
తుక్కుగూడ – పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా హైదరాబాద్ లోని తుక్కుగూడలో జరిగిన జన జాతర సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్బంగా గ్యారెంటీలను ప్రకటించింది. జాబ్ గ్యారెంటీ. చదువుకున్న ప్రతి యువకుడకు రూ. 1 లక్షకు తక్కువ కాకుండా వేతనం అందిస్తామని తెలిపింది. 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పేపర్ లీక్ ల నుండి విముక్తి కల్పిస్తామని, యువత కోసం రూ. 5,000 కోట్లతో కొత్తగా స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు రాహుల్ గాంధీ.
రెండో గ్యారెంటీ మహిళా న్యాయమని పేర్కొన్నారు. మహాలక్ష్మి కింద పేద కుటుంబానికి చెందిన ప్రతి మహిళలకు ఏడాదికి రూ. లక్ష ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆశా, మధ్యాహ్న భోజనం, అంగన్ వాడీ కార్యకర్తలకు అధిక వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. మహిళలకు హక్కులపై అవగాహన, వర్కింగ్ ఉమెన్స్ కోసం సావిత్రి భాయ్ పూలే పేరుతో హాస్టల్స్ .
మూడో గ్యారెంటీ కింద స్వామినాథన్ సిఫారసులతో రైతులకు కనీస మద్దతు ధర, రుణాల నుంచి విముక్తి పొందేందుకు శాశ్వత కమిషన్ ఏర్పాటు, పంట నష్ట పోకుండా బీమా సౌకర్యం, సరైన రీతిలో దిగుమతి, ఎగుమతి విధానం అమలు చేస్తామని ప్రకటించారు. జీఎస్టీ రహిత వ్యవసాయం అమలు చేస్తామన్నారు.
నాలుగో గ్యారెంటీ కింద కార్మికులకు గౌరవ వేతనం, అందరికీ ఆరోగ్య హక్కు, పట్టణ ఉపాధి హామీ , సామాజిక భద్రత కల్పిస్తామని చెప్పారు. సురక్షితమైన ఉపాధి కల్పిస్తామని గ్యారెంటీ ఇచ్చారు. సామాజిక న్యాయం ఐదో హామీ. సామాజిక, ఆర్థిక సమానత్వం దిశగా గణన. రిజర్వేషన్ పరంగా హక్కు కల్పించం , ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్ట పరమైన హామీ కల్పిస్తామన్నారు. నీరు , అటవీ, భూమిపై చట్ట పరమైన హక్కులు వర్తింప చేయడం, అప్ని ధరి అప్నా రాజ్ పేరుతో గిరిజనులకు భరోసా.