NEWSTELANGANA

నిరుద్యోగుల డిమాండ్ దిగొచ్చిన స‌ర్కార్

Share it with your family & friends

కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్సీల చ‌ర్చ‌లు

హైద‌రాబాద్ – కాంగ్రెస్ స‌ర్కార్ ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ , ఎమ్మెల్సీ బ‌ల్మూర్ వెంక‌ట్ నిరుద్యోగుల‌తో చ‌ర్చించారు. బేగంపేట లోని టూరిజం ప్లాజాలో వీరు స‌మావేశ‌మ‌య్యారు.

నిరుద్యోగులు చెప్పిన సమస్యలు విని, వాటిని పరిష్కరించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళతామ‌ని ఎంపీ, ఎమ్మెల్సీ వెల్ల‌డించారు. వారు కోరుకునే విధంగా సానుకూలమైన ప్రకటన వచ్చే విధంగా కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్ష కి మధ్య తక్కువ వ్యవధి ఉంద‌ని, ఇది వాస్త‌వ‌మేన‌ని , కానీ ఉద్దేశ పూర్వ‌కంగా ఇవ్వ‌లేద‌ని చెప్పారు. గతంలో డీఎస్సీ పరీక్షలు మే -జూన్ నెలలో ఉండాల‌ని, కాక పోతే డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వ‌హించాల‌ని కోరార‌ని తెలిపారు.

టెట్ పూర్త‌యింది..కానీ డీఎస్సీ, టీజీపీఎస్సీ ప‌రీక్ష‌లు అనుకోకుండా క్లాష్ అయ్యాయ‌ని పేర్కొన్నారు. నిరుద్యోగులు కోరుతున్న‌ది న్యాయ‌మైన డిమాండ్ అని త‌ప్ప‌కుండా సీఎంతో చ‌ర్చిస్తామ‌న్నారు. గ్రూప్ 2 పై సానుకూలంగా ప్ర‌క‌ట‌న చేయిస్తామ‌న్నారు. త్వ‌ర‌లోనే జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు ఎంపీ, ఎమ్మెల్సీ.