6న కాంగ్రెస్ ఛలో తుక్కుగూడ
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 6న హైదరాబాద్ లోని తుక్కుగూడలో ఛలో తుక్కుగూడ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ సోనియా గాంధీ, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరవుతారని టీపీసీసీ తెలిపింది.
ఈమేరకు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించం విశేషం. తెలంగాణ గడ్డపై భారత దేశానికి సంబంధించి రాబోయే ఎన్నికల్లో ఏం చేస్తామనే దానిపై స్పష్టమైన మేని ఫెస్టోను ఈ వేదిక నుంచే ప్రకటించడం జరుగుతుందని తెలిపారు సీఎం.
భారతావని దిశ దశ మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ నలుమూలల నుంచి తండోప తండాలుగా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇదే వేదిక రేపటి భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఆ నమ్మకం తనకు ఉందని ప్రకటించారు రేవంత్ రెడ్డి.