మోడీ ధ్యానం కాంగ్రెస్ ఆగ్రహం
ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ఫిర్యాదు
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. ప్రధానంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ దేశ వ్యాప్తంగా అమలులో ఉంది. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించింది కాంగ్రెస్ పార్టీ.
ఇదిలా ఉండగా దేశ ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. తాను రెండు రోజుల పాటు వివేకానందుడు నడయాడిన కన్యాకుమారి కేంద్రంగా ధ్యానం చేస్తానని వెల్లడించారు. దీనిపై అభ్యంతరం తెలిపింది కాంగ్రెస్ పార్టీ.
ఇంకా ఎన్నికలు పూర్తి కాకుండానే ఒక దేశానికి బాధ్యత కలిగిన ప్రధానమంత్రి ఇలాంటి కార్యక్రమాల గురించి బహిరంగంగా ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు సింఘ్వీ. ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధానమంత్రి ధ్యానం చేపట్టడం అనేది మోడల్ కోడ్ ను ఉల్లంఘించడమేనని ఆరోపించింది. దీని గురించి దేశంలోని ప్రధాన మీడియా ప్రసారం కూడా చేయకూడదని స్పష్టం చేసింది.