5 గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో
విడుదల చేసిన ఖర్గే..సోనియా
న్యూఢిల్లీ – త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో సీబ్ల్యూసీ కీలక సమావేశం జరిగింది. ఈ కీలక మీటింగ్ లో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ఐదు, ఆరు గ్యారెంటీలు బాగా వర్కవుట్ అయ్యాయి. ఇదే ప్లాన్ ను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు గాను మేనిఫెస్టో తయారు చేసే పనిలో పడింది ఏఐసీసీ.
ప్రధానంగా దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు అనూహ్యమైన రీతిలో స్పందన లభించింది. మహారాష్ట్రలో నిర్వహించిన సభకు ఊహించని విధంగా జనం తరలి వచ్చారు.
రైతులకు న్యాయం చేకూర్చేందుకు , యువతీ యువకులకు భరోసా కల్పించేందుకు, మహిళలకు సాధికారత లభించేలా చసేందుకు , కార్మికులకు భద్రత కల్పించే విషయంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అంతే కాకుండా ప్రజల హక్కులకు జవాబుదారీగా ఉండటంపై దృష్టి సారించింది మేనిఫెస్టో కమిటీ. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో ఐదు గ్యారెంటీలతో ముందుకు వెళ్లనుంది కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టమైంది.