రాహుల్ కు అవమానం కాంగ్రెస్ ఆగ్రహం
జాతీయ జెండా సందర్బంగా చివరి వరుసలో
ఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోడీ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కావాలని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడైన , రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీని అవమానించిందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ).
ఆగస్టు 15 సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోటపై ప్రధాన మంత్రి జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ప్రతిపక్ష నాయకుడికి సీటు కేటాయించడంలో వివక్ష చూపించారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఏఐసీసీ.
విచిత్రం ఏమిటంటే రాహుల్ గాంధీకి చివరి వరుసలో సీటు కేటాయించడం పట్ల మండిపడింది. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య తప్ప మరోటి కాదని పేర్కొంది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ కంటే ముందు పారిస్ రాజధాని పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో విజేతలకు సీట్లను కేటాయించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ప్రకారం నడుచు కోవడం లేదని, కావాలని రాహుల్ గాంధీకి సీటు కేటాయించకుండా అవమానించిందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ.