NEWSTELANGANA

కేటీఆర్ బ్ల‌డ్ శాంపిల్ టెస్ట్ చేయాలి – కాంగ్రెస్

Share it with your family & friends

మాజీ మంత్రి ఇంటి వ‌ద్ద పోలీసుల హ‌ల్ చ‌ల్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. తాజాగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసులు ఆయ‌న‌ను అరెస్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో విష‌యం తెలుసుకున్న గులాబీ నేత‌లు, శ్రేణులు పెద్ద ఎత్తున అక్క‌డికి చేరుకున్నారు.

ఇదిలా ఉండ‌గా మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఎక్స్ వేదిక‌గా తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. డ్ర‌గ్ పార్టీ ముఠా నాయ‌కుడు అంటూ సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేసింది.

జన్వాడ లో ఉన్న కేటీఆర్ బావమరిది ఫార్మ్ హౌస్ లో దొరికిన ఇండియన్ బాటిల్స్ , ఫారిన్ బాటిల్స్ క‌థ ఏమిటో చెప్పాల‌ని డిమాండ్ చేసింది. రేవ్ పార్టీలో 14 మంది మహిళలు, 21 మంది పురుషులు పాల్గొన్నారని ఆరోపించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రేవ్ పార్టీలను ప్రోత్సహించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్క‌టేన‌ని పేర్కొంది కాంగ్రెస్ పార్టీ. నిన్న జరిగిన రేవ్ పార్టీలో కేటీఆర్ ఉన్నాడో లేడో మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా మాజీ మంత్రికి సంబంధించి బ్ల‌డ్ శాంపిల్ కూడా టెస్టు చేయాల‌ని కోరింది. ప్ర‌తీ రోజూ స‌ర్కార్ మీద విమ‌ర్శలు గుప్పించే కేటీఆర్ ఇప్పుడు మీ బామ్మ‌ర్ది ఫామ్ హౌస్ లో నిర్వ‌హించిన రేవ్ పార్టీ మీద ఎందుకు స్పందించ‌డం లేదంటూ నిల‌దీసింది.