బీజేపీ సంకీర్ణ సర్కార్ బేకార్
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ
న్యూఢిల్లీ – ప్రస్తుత మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ పాలన గాడి తప్పిందని, దేశాన్ని వందేళ్లు వెనక్కి వెళ్లేలా చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎన్నడూ లేనంతగా పేదలు, నిరుద్యోగులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని కీలక వ్యాఖ్యలు చేసింది ఆ పార్టీ.
దేశ భవిష్యత్తు పూర్తిగా అంధకారంలో ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దేశాన్ని రక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని పేర్కొంది. ఊహించని రీతిలో ద్రవ్యోల్బణం వల్ల జీవనం కష్టంగా మారిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా మహిళలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారని తెలిపింది.
ఒకప్పుడు కాంగ్రెస్ సర్కార్ పాలనలో సిలిండర్ ధర రూ. 410 ఉండేదని ఇప్పుడు మోదీ పాలనలో అది కాస్తా వేయి రూపాయలను దాటిందని, మోయలేని రీతిలో భారంగా మారిందంటూ వాపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయని పేర్కొంది. నూనె, పప్పులు, పిండి, పంచదార, బియ్యం, కూరగాయలు అన్నీ కొండెక్కాయని ఆరోపించింది.