అపూర్వ విజయం కాంగ్రెస్ సంతోషం
ఇండియా కూటమిలో భారీ మెజారిటీ
న్యూఢిల్లీ – దేశంలో ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఫలితాల పండుగ పూర్తయింది. 543 సీట్లకు గాను బీజేపీ ఎన్డీయే కూటమి 293 సీట్లతో ముందంజలో కొసాగుతోంది. ఇక ముచ్చటగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మూడోసారి కొలువు తీరనున్నారు.
కానీ రెప్ప పాటులో అధికారాన్ని కోల్పోతోంది కాంగ్రెస్ కూటమి. ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా గళం ఎత్తాయి. అన్ని చోట్లా మోడీకి చుక్కలు చూపించేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది కూటమి.
ఇక భారత కూటమికి 237 ఎంపీ సీట్లు వచ్చాయి. మెరుగైన, బలమైన ప్రతిపక్ష పార్టీగా కూటమి నిలిచింది. ఈ ఇండియా కూటమిలో ఏకైక అతి పెద్ద పార్టీగా 97 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అవతరించింది. మొత్తంగా ఈ క్రెడిట్ అంతా రాహుల్ గాంధీకి దక్కుతుందనడంలో సందేహం లేదు. ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.