కేటీఆర్ కామెంట్స్ కాంగ్రెస్ సీరియస్
జాబ్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరింది కాంగ్రెస్ ప్రభుత్వం. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించింది. నిరుద్యోగుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొంది. పదేళ్లుగా నిరుద్యోగులను మోసం చేసింది ఎవరో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించింది. అందుకే మీకు అధికారంలోకి రాకుండా చేశారని , ఆ విషయం మరిచి పోయి తమపై బురద చల్లడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది.
పరీక్ష పేపర్లను అమ్ముకున్న సర్కార్ మీది కాదా , ఆ విషయం అప్పుడే మరిచి పోతే ఎలా అని నిలదీసింది. నమ్మి అధికారం అప్పగిస్తే మీరు చేసింది ఏమిటి..దోచు కోవడం దాచుకోవడం తప్పా అని మండిపడింది. ఇప్పుడు నీతులు చెబితే ఎవరూ వినే స్థితిలో లేరని స్పష్టం చేసింది కాంగ్రెస్ సర్కార్.
పదేళ్ల పాటు పాలన సాగించిన మీరు ఎందుకని పోస్టులను భర్తీ చేయలేక పోయారో చెప్పాలని డిమాండ్ చేసింది. తెలంగాణ యువత విలువైన దశాబ్ద కాలాన్ని, ఆశలను, ఆశయాలను నాశనం చేశారని ఆరోపించింది.
దాన్ని సరిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి.. ఉద్యోగాలను భర్తీ చేస్తూ.. గతంలో ఉన్న తప్పులను సరిచేస్తూ.. విద్యార్థి, నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలను తీసుకుంటూ పరీక్షలు నిర్వహించే పనిలో నిమగ్నమై ఉందని తెలిపింది.